Gukesh: దిగ్గజాల పోరులో గెలిచేది ఎవరో?

Gukesh to take on Carlsen at Norway Chess: చెస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గెలిచిన గుకేశ్ వచ్చే ఏడాది మరో పోరుకు సిద్ధమవుతున్నాడు. నార్వేలో మే 26 నుంచి జూన్ 6 వరకు జరగబోయే చెస్ టోర్నమెంట్‌లో గుకేశ్.. దిగ్గజ క్రీడాకారుడు, అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడనున్నాడు.
నార్వేలోని స్టావెంజర్ నగరంలో వింబుల్డన్ ఆఫ్ చెస్’గా పేరున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. 2023లో జరిగిన ఈ పోటీలలో గుకేశ్ మూడో స్థానంలో నిలవగా, ఈసారి ప్రపంచ ఛాంపియన్ హోదాలో కార్ల్‌సన్‌కు సొంతగడ్డపై సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ సోమవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. తండ్రి డాక్టర్ రజనీకాంత్‌తో కలిసి చెన్నై విమానాశ్రయంలో దిగిన గుకేశ్‌కు అదిరిపోయే స్వాగతం లభించింది.