Ruturaj Gaikwad Marriage: ఓ ఇంటివాడైన టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్.. నెట్టింట పెళ్లి ఫొటోలు వైరల్
Ruturaj Gaikwad Marriage: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా యువ ప్లేయర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జూన్ 03 శనివారం రోజున తన ప్రేయసి అయిన మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.

Ruturaj Gaikwad Marriage: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా యువ ప్లేయర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జూన్ 03 శనివారం రోజున తన ప్రేయసి అయిన మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుత్‌రాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వీరిద్దరూ తమ పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇద్దరూ క్రికెటర్లే(Ruturaj Gaikwad Marriage)
ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సీఎస్‌కే ఆటగాళ్లు తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉత్కర్షతో కలిసి ఫోటోలు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం సీఎస్‌కే కెప్టెన్ కెప్టెన్ కూల్ ధోనితో కూడా ఈ జంట ఫోటోలు దిగింది. కాగా ఇక్కడ మరో విశేషం ఏంటంటే రుతురాజ్ లాగానే ఉత్కర్ష కూడా ఓ క్రికెటర్. ఆమె మహారాష్ట్ర తరఫున దేశవాలీ క్రికెట్ ఆడింది. ఆమె మీడియం పేస్ బౌలర్‌గా రాణించింది.
ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణేలో జన్మించింది. క్రికెట్‌పై ఆసక్తితో ఉత్కర్ష 11 ఏళ్ల నుండే ఆడటం మొదలుపెట్టింది. దేశవాలీ క్రికెట్ లో 10 మ్యాచ్‌లు ఆడిన ఆమె 5 వికెట్ల పడగొట్టింది. ఇకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు రుతురాజ్ గైక్వాడ్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే పెళ్లి కోసమే ఆ మ్యాచ్ కు బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం. టీమ్ ఇండియా రిజర్వ్ జాబితాలో రితురాజ్ పేరుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Chiranjeevi: నేనెప్పుడూ క్యాన్సర్ బారిన పడలేదు.. అలా రాయద్దొ- మెగాస్టార్ చిరంజీవి
- Gold And Silver Prices: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు