Last Updated:

Urvasivo Rakshasivo: రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘ఊర్వసివో రాక్షసివో’.. మూవీ రివ్యూ ఇలా

Urvasivo Rakshasivo: రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘ఊర్వసివో రాక్షసివో’.. మూవీ రివ్యూ ఇలా

Cast & Crew

  • అల్లు శిరీష్‌ (Hero)
  • అనూ ఇమ్మాన్యుయేల్‌ (Heroine)
  • ఆమని, పృథ్వీ, సునీల్‌, వెన్నెల కిషోర్‌ (Cast)
  • రాకేష్‌ శశి (Director)
  • ధీరజ్‌ మొగిలినేని, విజయ్‌.ఎం (Producer)
  • అనూప్ రూబెన్స్ (Music)
  • తన్వీర్ (Cinematography)
3.5

Urvasivo Rakshasivo: యువ హీరో, అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాపై మొదటి నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ల ద్వారా ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ తరుణంలో ఇవాళ విడుదలైన ఊర్వశివో రాక్షసివో..’ మూవీ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో చూసేద్దాం.

కథ ఏంటంటే
భిన్న మనస్తత్వాలు, విభిన్న కుటుంబ నేపథ్యాలు కలిగిన శ్రీకుమార్‌ (అల్లు శిరీష్‌), సింధూజ (అనూ ఇమ్మాన్యుయేల్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తూ ఉండగా వీరిరువురి మధ్య ప్రేమ చిగురించి సహజీవనానికి దారితీస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రుల ఆంక్షల మధ్య సతమతమవుతున్న శ్రీకుమార్‌. అందుకు పూర్తి భిన్నంగా ఆధునిక భావాలతో లైఫ్ లీడ్ చేస్తున్న సింధూజ. మరి ఈ జంట మధ్య ఏర్పడిన ఇగో లు, భావాల సంఘర్షణ చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? వారి ప్రేమాయాణం ఏ తీరాలకు చేరుతుందన్నదే ఈ సినిమా కథ.

సినిమా విశ్లేషణ

ఇలాంటి విభన్న నేపథ్యాలుగల ప్రేమజంట కథతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ పాయింట్‌ ఎంత పాతదైనా కథను ఎంత కొత్తగా, ఎంగేజింగ్‌గా చెప్పామనే విషయానికే ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. తాను ఎంచుకున్న అంశాన్ని ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు రాకేష్‌ శశి పూర్తిగా సఫలీకృతుడయ్యారు. తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలైపోవాలనుకుంటాడు శ్రీకుమార్‌కి పెళ్లి అంటే బాధ్యతల్లో బందీ కావడమే సహజీవనం బెస్ట్ అని భావించే సింధూజకి మధ్య ప్రేమ ఎలా స్టార్ట్ అవుతుంది.. సింధూజను ప్రేమలో దింపడానికి శ్రీ చేసే ప్రయత్నాలన్నీ సినిమా ఫస్ట్ ఆఫ్ లో చక్కటి వినోదాన్ని పంచాయి. పబ్‌ పార్టీలో సింధూ, శ్రీకుమార్‌కు తన ప్రేమను చెప్పడంతో కథ వేగం పుంజుకుంటుంది. అయితే పార్టీలో తాను సరదాగా చెప్పిన మాటల్ని ప్రేమ అనే కోణంలో తీసుకోవద్దని సింధూజ చెప్పడంతో శ్రీకుమార్‌లో ఆలోచన మొదలవుతుంది. ఇలా ప్రీ ఇంటర్వెల్‌ ఎపిసోడ్స్‌ చాలా ఎమోషనల్ గా సాగాయి. బ్రేకప్‌ ఎపిసోడ్‌తో సినిమా ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది.

ఇక శ్రీకుమార్‌, సింధూజల సహజీవనంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఈ క్రమంలో పండే కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రేమ, పెళ్లి విషయంలో ప్రేమికుల మధ్య అభిప్రాయభేదాలు, ఇగో సమస్యల్ని హార్ట్‌టచింగ్‌గా తెరపై తీసుకొచ్చాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌ ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగుతుంది. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఉన్న సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

నటీనటులు

అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయేల్ వారి వారి పాత్రల్లో జీవించారు. సునీల్, వెన్నెల కిషోర్ పర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్ుతంది. అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా నిలిచింది. మొత్తంగా ఈ తరం చూస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా, ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో ‘ఉర్వశివో రాక్షసివో.’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

ఇదీ చదవండి: సుధీర్ “గాలోడు” చిత్రం ట్రైలర్ అదిరింది

ఇవి కూడా చదవండి: