Telangana Politics: జగన్ కు తలనొప్పిగా బీజేపీ ’తెలంగాణ ఈక్వేషన్స్‘
తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది .... ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తోంది... అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్.. అందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Telangana Politics: తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది . ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్. అందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది..దీంతో బీజేపీ ఎత్తుగడలు ఇప్పుడు చంద్రబాబుకు ఊరటనిస్తున్నట్లే కనిపిస్తున్నాయి.. అలాగే ఏపీ రాజకీయాల్లో పట్టు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి . ఇదంతా గమనిస్తున్న జగన్ ను మాత్రం చికాకు పెడుతున్నాయంటున్నారు.
తెలంగాణలో అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబును అక్కున చేర్చుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ.. అదే క్రమంలో జగన్ కు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి, అంతకంటే జగన్ కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైసీపీ సర్కార్ ఖర్చుపెట్టిన నిధులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోంది . మరోవైపు రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలోనూ జగన్ కు మద్దతిచ్చినట్లే ఇచ్చి తిరిగి అమరావతివైపు టర్న్ తీసుకుంది . ఇలా రెండు కీలక విషయాల్లో జగన్ ను ఇబ్బంది పెడుతున్న బీజేపీ.. అదే సమయంలో చంద్రబాబుపై జగన్ కోరిన సీబీఐ దర్యాప్తు చేయించకపోగా. ఆయనకు తాజాగా కుప్పం టూర్ లో అదనపు భద్రత కూడా ఇచ్చేసింది . దీంతో పాటు తాజాగా మోదీ అపాయింట్‌మెంట్ దొరకడం చంద్రబాబుకు భారీ ఊరటగా మారింది.
ఓవైపు జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, కేంద్ర పథకాల నిధులు మళ్లించుకోకుండా కట్టడి చేస్తూ. డా విభజన హామీల్లో కొత్తగా ఒక్క దాన్నీ అమలు చేయకపోవడం చూస్తుంటే బీజేపీ తీరు అర్ధమవుతోంది . గతంలో జగన్ తెచ్చిన ఒత్తిడితో ప్రత్యేక హోదా అడిగిన చంద్రబాబుకు ఇలాంటి సహాయనిరాకరణతోనే మరింత టార్గెట్ చేసి ఎన్డీయే నుంచి వెళ్లిపోయేలా చేసిన బీజేపీ. సరిగ్గా ఇప్పుడు కూడా అదే రాజకీయాన్ని రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఒత్తిడికి తట్టుకోలేక జగన్ ఎక్కడైనా స్పందిస్తే, లేదా బీజేపీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే దాన్ని సాకుగా తీసుకుని పాత రాజకీయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కాషాయ శిబిరం ఎత్తులు వేస్తోందంటున్నారు. అందుకే బీజేపీకి జగన్ ఆ ఒక్క అవకాశం ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బీజేపీ నుంచి సహకారం అందకపోయినా వైఎస్ జగన్ ఎప్పటిలాగే మౌనంగానే ఉంటున్నారు. బీజేపీ ఆశిస్తున్నట్లు దూకుడుగా స్పందించడం లేదు. చంద్రబాబుకు గతంలో ఎదురైన అనుభవాల్నిదృష్టిలో పెట్టుకుని ఎదురుదాడి కంటే లాబీయింగ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బీజేపీ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ పై పోరు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ కారణాలతో మద్దతిస్తోంది. టీడీపీకి దగ్గరైతే సెటిలర్ల ఓట్లతో తెలంగాణలో సునాయాసంగా గెలుపొందవచ్చన్నది కాషాయ నేతల స్కెచ్‌గా కనిపిస్తోంది
ఆ క్రమంలో జగన్ ఎక్కడైనా సహనం కోల్పోతే ఏపీలోనూ టీడీపీ-బీజేపీ పొత్తు కుదుర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది మరి జగన్ బీజేపీకి ఆ అవకాశం ఇస్తారా, ఇవ్వకపోతే బీజేపీ మరిన్ని అంశాల్లో జగన్ ను టార్గెట్ చేయబోతోందా ? తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిస్తే ఏం జరగబోతోంది ? అన్న అంశాలే ఏపీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నట్లు కనిపిస్తున్నాయి.