Home / పొలిటికల్ వార్తలు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఉదయం రాజ్ విహార్ సర్కిల్ సమీపంలోని మౌర్య ఇన్ హోటల్ లో జరిగిన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించారు.
టీఆర్ఎస్ గూండాలు కుల అహంకారంతో తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు ఆయన సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కమలాపూర్ లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా లబ్దిదారుల పై అసహనం వ్యక్తం చేసారు.
సీఎం జగన్ ప్రైవేటు విమానాల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న టీడీపీ నేత పట్టాభిరాం వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు
ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చెయ్యకపోతే ఎవరు చేస్తారు ? హోమ్ మంత్రి చేస్తారా అంటూ ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన విమర్శల పై ఆయన స్పందించారు.
2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు.