Home / పొలిటికల్ వార్తలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సహాయకుడు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని, అతని నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిపై మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ వాళ్లు దాడి చేసినపుడు ఎక్కడికి పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు
కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు.
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి మరో లేఖ విడుదల చేసాడు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు.