Last Updated:

Rahul Gandhi: మరింత ముదిరిన రాహుల్ గాంధీ టీ షర్ట్ ఇష్యూ.. కొత్తగా మోదీ కూడా?

ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Rahul Gandhi: మరింత ముదిరిన రాహుల్ గాంధీ టీ షర్ట్ ఇష్యూ.. కొత్తగా మోదీ కూడా?

Rahul Gandhi: ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలోని మహాత్మా గాంధీ మరియు పలువురు మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలను సందర్శించి వారికి నివాళులర్పించారు. ఆ సమయంలో రాహుల్ కేవలం టీ-షర్ట్ మాత్రమే ధరించి కనిపించడంతో ఇంతటి చలిని ఆయన ఎలా తట్టుకుంటున్నారనేది ప్రజలందరి దృష్టిని ఆకర్షించే అంశం. అంతేకాకుండా, మాజీ ప్రధానులకు నివాళులు అర్పించే సమయంలో కూడా రాహుల్ చెప్పులు లేకుండా బేర్ ఫుట్ తో కనిపించారు.

Image

ఇకపోతే 52 ఏళ్ల వయసులోనూ రాహుల్‌ 25 ఏళ్ల యువకుడిలా ఇంతటి చలిలోనూ ఉత్సాహంగా ఎలా నడుస్తున్నారు అంటూ పలువురు ఆయనను ప్రశ్నించగా దానికి రాహుల్  “నాకు చలి అనిపించడం లేదని వారు నన్ను అడుగుతూనే ఉన్నారు. కానీ వారు రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఈ ప్రశ్న అడగరు,” అని చాలా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

“నేను 2,800 కి.మీ నడిచాను, కానీ అది పెద్ద విషయం కాదని నేను నమ్ముతున్నాను. రైతులు ప్రతిరోజూ చాలా దూరం నడుస్తారు. వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు ఇలా నిజానికి చాలా మంది భారతదేశ ప్రజలు ఎముకలు కొరికే చలిలో ప్రాథమిక వస్తువులు కూడా లేకుండా పనులు చేసుకుంటూ జీవనం చేస్తుంటారు. యాత్రలో అన్ని రకాల ప్రజలను కలిశానని- వారి సమస్యలు వారి జీవన విధానం గురించి తెలుసుకున్నాను” అని రాహుల్ చెప్పుకొచ్చారు.

Image

ఇదిలా ఉంటే చలిలోనూ రాహుల్ టీ షర్ట్ ధరించి పాదయాత్ర చెయ్యడంపై పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా అంతటి ఫిట్ నెస్, స్టామినా రాహుల్ కే సాధ్యం అంటూ ట్వీట్లు మొదలు పెట్టారు. దానికి మరికొందరు నెటిజన్లు 52 ఏళ్ల వయస్సులో రాహుల్ టీషర్ట్ వేసుకుని నడిస్తే ఇలా అంటున్నారు. చలికాలం ఉదయం టీషర్ట్‌తో నడిచినందుకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ దర్బారీలు అభినందిస్తున్నారు. ఈ ఓడిపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని గుర్తుచేయాలి, 71 సంవత్సరాల వయస్సులో, గత సంవత్సరం డిసెంబర్ నెలలో మంచు-చల్లని నీటిలో గంగలో స్నానం చేసి 5 నిమిషాల పాటు మోదీ ఆ నీటిలోనే గడిపారు. అదీ ఫిట్ నెస్ అంటే అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతలు అటు తమ ఫిట్ నెస్ తోనూ మరియు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ దూసుకుపోతున్నారు.

ఇదీ చదవండి: రాహుల్ భారత్ జోడో కోసం పీవీ కుటుంబాన్ని పిలిచారు కానీ పీవీ విగ్రహాన్ని సందర్శించలేదు.. పీవీ మనవడు సుభాష్

ఇవి కూడా చదవండి: