Home / జాతీయం
న్యూఢిల్లీకి చెందిన ఒక వివాహిత తన ప్రేమికుడిని కలవడానికి పాకిస్థాన్‌కు వెళ్లింది. అయితే, ఎలాంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి చొరబడిన సీమా హైదర్‌లా కాకుండా, వీసాపై అధికారులు అంజుకి పాకిస్తాన్లోకి ప్రవేశం కల్పించారు.ఆమె వాఘా మార్గంలో పాకిస్తాన్ చేరుకుని అక్కడనుంచి ఇస్లామాబాద్ కు చేరుకుందని ఆజ్ న్యూస్ నివేదించింది
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేను రెండు రోజుల పాటు నిలిపివేసింది సుప్రీంకోర్టు. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న చారిత్రాత్మక మసీదు సముదాయంలో సర్వే తవ్వకానికి దారితీస్తుందనే భయంతో మసీదు నిర్వహణ కమిటీ కేంద్రాన్ని సంప్రదించింది.
: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉన్నది
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తన భార్య పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి వెళుతుండగా గొడవపడి ఓ వ్యక్తి కాల్చిచంపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీషని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని టంగుటూరు మండలం ఆలకూరుపాడులో నివసిస్తున్న ఆర్కే భార్య శిరీష నివాసంలో శుక్రవారం ఉదయంనుంచి ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రంపూట శిరీషని అరెస్ట్ చేశారు
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ శనివారం ఆరోపించింది. మే 4 మణిపూర్ వీడియోపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ వచ్చింది.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 25 కు చేరింది. ఈ ఘటనలో 86 మంది గ్రామస్తుల జాడ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. వీరికోసం గాలింపు జరుగుతోందని అన్నారు.
Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
కేంద్రం గురువారం నాడు నాన్ బాస్మతి అంటే తెల్లబియ్యం ఎగుమతిని నిషేధించింది. దీంతో గ్లోబల్ ఫుడ్ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది లోకసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకారం, ఈ సంవత్సరం రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు జరుపుకుంటున్నాయి. భారతదేశం-శ్రీలంక దీర్ఘకాల సంబంధాలను సమీక్షించడానికి మరియు మరింత ఊపందుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని సూచిస్తుంది.