Last Updated:

Visa Services: కెనడా పౌరులకు వీసా సేవలను నిలిపివేసిన భారత్

భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదాల నేపధ్యంలో కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. వీసా కన్సల్టెన్సీ సేవలను అందించే భారతదేశంలోని ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రం అయిన BLS ఇంటర్నేషనల్ నోటీసును దాని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

Visa Services: కెనడా పౌరులకు వీసా సేవలను నిలిపివేసిన భారత్

Visa Services: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదాల నేపధ్యంలో కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. వీసా కన్సల్టెన్సీ సేవలను అందించే భారతదేశంలోని ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రం అయిన BLS ఇంటర్నేషనల్ నోటీసును దాని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. భారత మిషన్ నుండి ముఖ్యమైన నోటీసు: కార్యాచరణ కారణాల వల్ల, 21 సెప్టెంబర్ 2023 నుండి భారతీయ వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. తదుపరి నోటీసు వరకు దయచేసి తదుపరి నవీకరణల కోసం BLS వెబ్‌సైట్‌ని తనిఖీ చేస్తూ ఉండండి అంటూ పేర్కొంది.

కెనడా ప్రధాని వ్యాఖ్యలతో..(Visa Services)

కెనడా ప్రధాని ట్రూడో సోమవారం పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపడం వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించారు.భారతదేశం దీనిపై ఘాటుగా స్పందించింది. వీటిని నిరాధారమైన ఆరోపణలు గా పేర్కొంది. అనంతరం, రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించి, వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని కోరాయి. బుధవారం భారత్ కెనడాలో తన పౌరులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ద్వేషపూరిత నేరాలు మరియు నేరపూరిత హింస అత్యున్నత స్థాయికి చేరుకున్నందున ఒట్టావాకు ప్రయాణించకుండా ఉండాలని హెచ్చరించింది.

బుధవారం, ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ), ఒక వీడియో సందేశంలో, కెనడాలో నివసిస్తున్న హిందువులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఇండో-హిందువులు కెనడాను విడిచిపెట్టండి. భారతదేశానికి వెళ్ళండి. మీరు భారతదేశానికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఖలిస్థాన్ అనుకూల సిక్కుల ప్రసంగం మరియు వ్యక్తీకరణను అణిచివేసేందుకు కూడా మీరు మద్దతు ఇస్తున్నారు” అని SFJ యొక్క న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్ను సోషల్‌ మీడియాలో వైరల్ అయిన వీడియోలో తెలిపారు.