Chandrayaan-3: చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఈరోజు మేల్కొంటాయా?
చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక అప్‌డేట్‌ని ఇస్రో వెల్లడించింది. ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవంపై మళ్ళీ పగలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై సూర్యకాంతి పడగానే మళ్లీ వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3: చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక అప్‌డేట్‌ని ఇస్రో వెల్లడించింది. ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవంపై మళ్ళీ పగలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై సూర్యకాంతి పడగానే మళ్లీ వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో ప్రకటించింది.
మరో 14 రోజులపాటు సేవలు..( Chandrayaan-3)
ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేల్కొని ప్రయోగాలు కొనసాగిస్తాయా? అన్న అంశంలో ఆసక్తి నెలకొంది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ అప్పగించిన పనులు పూర్తిచేశాయి. చంద్రుడికి సంబంధించి విలువైన సమాచారాన్ని అందించాయి. అనంతరం అక్కడ రాత్రి సమయం ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు వాటిని స్లీప్‌మోడ్‌లోకి పంపించారు.ఈ రోజు చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ సూర్యోదయం కాబోతోంది. ఇప్పటి వరకు అక్కడున్న మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను అనుభవించిన విక్రమ్, ప్రజ్ఞాన్ రెండూ సూర్యకాంతి పడగానే మళ్లీ మేల్కొంటాయా? అన్నదానిపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తే మరో 14 రోజులు వాటి సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే ఇస్రోకు అది బోనస్ అవుతుంది.
ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక చంద్రయాన్ మిషన్ భారతదేశాన్ని ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా చేసింది. అంతేకాదు చంద్రుని యొక్క దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా నిలిచింది. చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రదేశానికి “శివశక్తి పాయింట్” అని పేరు పెట్టారు. చంద్రయాన్ -2 ల్యాండర్ 2019 లో చంద్రుని ఉపరితలంపై క్రాష్-ల్యాండ్ అయిన ప్రదేశానికి “తిరంగా పాయింట్” అని పేరు పెట్టారు.