Home / జాతీయం
దిగ్గజ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967 మరియు 1979 మధ్య, దిగ్గజ స్పిన్నర్ భారతదేశం తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. బేడీ, ఎరపల్లి ప్రసన్న,చంద్రశేఖర్ మరియు వెంకటరాఘవన్లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో కీలకమైన ఆటగాడిగా నిలిచారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా ఆర్దికసాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా, రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అగ్నివీర్ అందించిన సేవా నిధిలో 30 శాతం, ప్రభుత్వం నుండి సమానమైన సహకారం మరియు విరాళాలపై వడ్డీ ఉన్నాయి.
సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.
దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ (సిఆర్ పార్క్)లో ఉన్న దుర్గాపూజ మండపాన్ని సందర్శించారు. అక్కడ నిర్వాహకులు ఆయనకు బెంగాలీ సంప్రదాయంలో స్వాగతం పలికారు. మండపంలో నిర్వహించిన పూజ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 పరీక్షను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది.
ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది.
ఆన్లైన్ గేమ్ డ్రీమ్11లో రూ. 1.5 కోట్లు గెలుచుకుని మిలియనీర్‌గా మారిన పూణే పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. పూణెలోని పింప్రి-చించ్వాడ్ పోలీసులు అతనిపై దుష్ప్రవర్తన మరియు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు.