Home / జాతీయం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ నెలలోనే పలు బహిరంగ సభల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. దేశం నుంచి నిర్మూలించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక అప్డేట్ని ఇస్రో వెల్లడించింది. ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవంపై మళ్ళీ పగలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై సూర్యకాంతి పడగానే మళ్లీ వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో ప్రకటించింది.
రాజస్తాన్ లో సరస్సుల నగరంగా పేరుపొందిన ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సెప్టెంబరు 24న లీలా ప్యాలెస్‌లో పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి.
అమీర్ ఖాన్ '3 ఇడియట్స్'లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించిన నటుడు అఖిల్ మిశ్రా కిచెన్ లో జారిపడి మరణించారు. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న మిశ్రా వంటగదిలో జరిగిన ప్రమాదంలో గాయాలపాలై మృతి చెందినట్లు ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ తెలిపారు.
భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదాల నేపధ్యంలో కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. వీసా కన్సల్టెన్సీ సేవలను అందించే భారతదేశంలోని ఆన్లైన్ వీసా దరఖాస్తు కేంద్రం అయిన BLS ఇంటర్నేషనల్ నోటీసును దాని వెబ్సైట్లో పోస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది.
ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. గ్రాడ్యుయేట్ మెడికల్ డాక్టర్లు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి విదేశాలలో వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగించవచ్చు. అంతేకాదు వారు అక్కడ ప్రాక్టీసు కూడా చేయవచ్చు
గురువారం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి ప్రజలను మరోసారి ఆశ్చర్యపరిచారు, అక్కడ ఆయన రైల్వే పోర్టర్లతో సమావేశమయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు పోర్టర్ దుస్తులు ధరించి లగేజ్ కూడా మోసారు.
లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటాను అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇది
కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు మరియు రాజకీయంగా మన్నించబడుతున్న ద్వేషపూరిత నేరాలు మరియు హింసాకాండను దృష్టిలో ఉంచుకుని "అత్యంత జాగ్రత్త వహించాలని భారత ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు మరియు విద్యార్థులకు సూచించింది.