Sukhdev Singh Gogamedi: రాజ్‌పుత్ కర్ణి సేన నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ దారుణ హత్య
రాజస్తాన్‌లో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు,రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన్ చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గోగమెడిని గుర్తు తెలియని వ్యక్తులు జైపూర్‌లో ఆయన ఇంటి సమీపంలో కాల్చి చంపి పారిపోయారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు.
Sukhdev Singh Gogamedi: రాజస్తాన్‌లో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు,రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన్ చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గోగమెడిని గుర్తు తెలియని వ్యక్తులు జైపూర్‌లో ఆయన ఇంటి సమీపంలో కాల్చి చంపి పారిపోయారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుఖ్‌దేవ్ సింగ్‌తో పాటు ఆయన ఇద్దరు అనుచరులకు కూడా బుల్లెట్ గాయాలు తగిలాయి. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా సుఖ్‌దేవ్ సింగ్ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు.
పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా..(Sukhdev Singh Gogamedi)
సిసి కెమెరా దృశ్యాల ప్రకారం సుఖదేవ్ సింగ్‌పై తలపై చాతీపై బుల్లెట్లు దూసుకుపోయాయి కాల్పుల ధాటికి తలుపులు ధ్వంసం కావడంతో పాటు నేలపై రక్తం చిందినట్లు సోషల్ మీడియాలో వీడియాలు హల్‌చల్ చేస్తున్నాయి. కర్ణిసేన నాయకుడు హత్య తనకు దిగ్బ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పోలీసు కమిషనర్‌తో మాట్లాడానని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించానని చెప్పారు. రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేర రహిత రాష్ర్టంగా మారుస్తామన్నారు. ఇటీవలే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక సుఖ్‌దేవ్ సింగ్ గోగమెడి విషయానికి వస్తే ఆయన రాజ్‌పుత్ కర్ణి సేన స్థాపించి బాలీవుడ్ సినిమా పద్మావత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.