I.N.D.I.A Meeting: I.N.D.I.A కూటమి సమావేశం వాయిదా.. ఎందుకో తెలుసా?
డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్‌తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
I.N.D.I.A Meeting: డిసెంబర్ 6 న జరగాల్సిన I.N.D.I.A కూటమి సమావేశం పలువురు ముఖ్య నేతలు రాకపోవడంతో వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , నితీష్ కుమార్‌తో సహా కూటమిలోని కొంతమంది కీలక సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
ఈ సమావేశానికి హాజరయ్యే ఆలోచన తమ పార్టీ అధినేతకు లేదని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించగా, ఇంతకుముందు సమావేశం గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు రేపు జరిగే భారత కూటమి సమావేశానికి హాజరయ్యే ఆలోచన లేదు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ లేదా ఇతర నాయకులు ఎవరైనా సమావేశానికి వెడతారని చౌదరి చెప్పారు.
ముందే ఖరారయిన షెడ్యూల్ ..(I.N.D.I.A Meeting)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారమే I.N.D.I.A కూటమి సమావేశానికి హాజరు కాలేరని చెప్పారు. నేను డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు ఉత్తర బెంగాల్‌ను సందర్శిస్తాను. డిసెంబర్ 6న సమావేశ తేదీ గురించి నాకు తెలియదు.అందువలన నేను రాలేనని మమత అన్నారు. తనకు ముందుగా తెలియజేసి ఉంటే తన ప్రయాణ ప్రణాళికను మార్చుకుని ఉండే అవకాశముండేదని అన్నారు. కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా డిసెంబర్ 6 సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నందున కొత్తగా ఏర్పడిన కూటమికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కుమార్ ఆరోపించారు.