Last Updated:

Byju Raveendran: ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.100 కోట్ల విలువైన ఇంటిని తనఖా పెట్టిన బైజు రవీంద్రన్

: తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.100 కోట్ల విలువైన తన నిర్మాణంలో ఉన్న విల్లా మరియు తన కుటుంబ సభ్యుల ఇళ్లను తాకట్టు పెట్టినట్లు సమాచారం.

Byju Raveendran: ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.100 కోట్ల విలువైన ఇంటిని తనఖా పెట్టిన బైజు రవీంద్రన్

Byju Raveendran: తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.100 కోట్ల విలువైన తన నిర్మాణంలో ఉన్న విల్లా మరియు తన కుటుంబ సభ్యుల ఇళ్లను తాకట్టు పెట్టినట్లు సమాచారం.

కంపెనీకి $800 మిలియన్లు..(Byju Raveendran)

బెంగళూరులో రవీంద్రన్ కుటుంబానికి చెందిన రెండు గృహాలు మరియు నిర్మాణంలో ఉన్న అతని విల్లా (సుమారు రూ. 100 కోట్లు) రుణం తీసుకోవడానికి తాకట్టు పెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. సోమవారం బైజు మాతృ సంస్థ థింక్ & లెర్న్ ప్రైవేట్‌లో 15,000 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఈ నిధులను ఉపయోగించినట్లు తెలుస్తోంది.ఒకప్పుడు అత్యంత విలువైన టెక్ స్టార్టప్ అయిన బైజూస్, వాల్యుయేషన్‌లో భారీ కోత కారణంగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంవత్సరం మేలో, పెట్టుబడి సంస్థ బ్లాక్‌రాక్ దాని విలువను 2022లో సాధించిన $22 బిలియన్ల నుండి $8.4 బిలియన్లకు తగ్గించింది. జూన్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ప్రోసస్ దీని విలువను $5.1 బిలియన్లుగా పేర్కొంది.రవీంద్రన్ వ్యక్తిగత స్థాయిలో సుమారు $400 మిలియన్ల అప్పులను సేకరించారు. మాతృ సంస్థలో తన వాటాలన్నింటినీ తాకట్టు పెట్టారు. వాటా విక్రయాల ద్వారా సేకరించిన $800 మిలియన్లను కంపెనీకి తిరిగి ఇచ్చారు.