Home / జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.దేశం పట్ల వారి త్యాగం మరియు అంకితభావానికి వారిని కొనియాడారు. వీరులకు భారతదేశం కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని అన్నారు. హిమాచల్లో బలగాలతో గడిపిన సమయం లోతైన భావోద్వేగం మరియు గర్వంతో నిండి ఉందని చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇక ఈ క్రమంలోనే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ..
మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్ధినిలపై కామ వాంఛ తీర్చుకోవడం కోసం దారుణాలకు ఒడిగట్టడం చూస్తున్నాం.
దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం కట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని చూస్తోంది. గత ఏడాది దీపావళి సందర్భంగా 15.76 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించారు. ఈసారి, మరో రికార్డు సాధించడానికి 51 ఘాట్లలో దీపాలు వెలిగించబడతాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా వెల్లడించారు.
దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారంలో తాజాగా ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై వేటు పడింది.
ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
యూట్యూబర్ మరియు బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది నోయిడాలోని ఒక పార్టీలో పాము విషాన్ని ఉపయోగించారనే అ నుమానంతో జరిగిన విచారణలో బాలీవుడ్ గాయకుడు ఫాజిల్పురియా ఈ పాములను ఏర్పాటు చేసినట్లు ఎల్విష్ చెప్పాడని సమాచారం.
బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.