Home / జాతీయం
లీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసు కస్టడీలోనే ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అనుజును సమీపంలోని గోకుల్దాస్ తేజ్‌పాల్ ఆస్పత్రికి తరలించారు.. డాక్టర్లు పరీక్ష జరిపి చనిపోయాడని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10.4 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు మాత్రం తూర్పు ఇండియాతో పాటు పశ్చిమబెంగాల్లో నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రెండు విడతల పోలింగ్ కూడా ముగిసింది. మూడో విడత పోలింగ్ మే 7న జరుగనుంది. మూడవ విడతలో మొత్తం 12 రాష్ర్టాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 94 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అయితే దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ మాత్రం గాంధీలకు కంచుకోట అయిన అమెథీ, రాయబరేలీ మీదే ఉన్నాయి.
ఏప్రిల్ నెల జీఎస్టి వసూళ్లు దుమ్ము రేపాయి. ఏకంగా రూ. 2.10 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 12.4 శాతం వసూళ్లు పెరిగాయి. ఆర్థికమంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకరం దేశీయ లావాదేవీలు 13.4 శాతం పెరిగిపోవడంతో పాటు దిగుమతులు 8.3 శాతం వరకు పెరిగాయి. జీఎస్టీ రిఫండ్ తర్వాత నికరంగా ఏప్రిల్ నెలలో రూ. 1.92 లక్షల కోట్లుగా తేలింది.
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు సేలం జిల్లాలోని యార్కాడ్‌లో లోయలో పడి ఐదుగురు చనిపోయారని బుధవారం అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు సేలం నుంచి 56 మంది ప్రయాణికులతో బయలు దేరింది.
డిల్లీలోని 80కి పైగా స్కూళ్లు, మరియు నోయిడాలోని కనీసం రెండు స్కూళ్లకు బుధవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, దీంతో ఈ పాఠశాలలనుంచి విద్యార్దులను తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోల జమానా నడుస్తోంది. మనిషిని పోలిన మనిషి తయారు చేయడం .. చెప్పని విషయాలు చెప్పినట్లు సృష్టించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో సినీతారల డీప్ ఫేక్ వీడియోలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డీప్ ఫేక్ వీడియోలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఊరు పేరు లేని వారికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు... రాజ్యసభ సీట్లు అప్పగించారు. అయితే కష్ట కాలంలో వెన్నంటి ఉండాల్సిన సమయంలో తన పార్టీ సహచరులే ఇప్పడు ముఖం చాటేస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా మొదటివరుసలో ఉన్నాడు. పార్టీలోని ప్రతి ఒక్కరు చద్దా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన కంపెనీ పతంజలి ఆయుర్వే లిమిటెడ్, దివ్య ఫార్మసీపై కొరఢా ఝళిపించింది. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాందేవ్‌తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ప్రొడక్టులతో అన్నీ రోగాలు మాయం అవుతాయని తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది.