Home / జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్నుప్రారంభించారు. తమిళనాడులో రూ.20,140 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో తిరుచ్చి చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, స్వాగతం పలికారు.
హిట్-అండ్-రన్' నిబంధనపై డ్రైవర్లు మరియు ట్రక్కర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వివిధ రాష్ట్రాలలో నిరసనలు వెల్లువెత్తాయి. వీరి ఆందోళన రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాను దెబ్బతీస్తుందనే భయంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో రాష్ట్రాలలో పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు క్యూలు కట్టారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి మళ్ళీ గడ్డుకాలం దాపురించింది. సీబీఐ మరోసారి డీకే శివకుమార్‌కి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే విచారణకి ఈ నెల 11న హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి.
కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీనితో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.
బీహార్‌లోని మోతీహరి వీధుల్లో ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయి ట్రాఫిక్‌కు పెద్ద అంతరాయం కలిగించింది.పాత విమానాన్ని ముంబై నుంచి అసోంకు ట్రైలర్ ట్రక్కుపై తరలిస్తుండగా, పిప్రకోఠి ప్రాంతంలోని ఓవర్‌బ్రిడ్జి కింద చిక్కుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అయోధ్య పట్టణానికి చేరుకుని అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు.రైల్వే స్టేషన్ నుండి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్' అని పేరు మార్చనున్నట్లు సంబంధిత వర్గాలుతెలిపాయి. రామాయణ రచయితగా ఖ్యాతికెక్కిన వాల్మీకి పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని భావించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. క్రిమినల్ కోడ్లు మరియు చట్టాలను సరిదిద్దే మూడు చట్టాలతో సహా కొన్ని మైలురాయి బిల్లులను పార్లమెంటులో ఆమోదించిన తరువాత వారి సంఖ్య బాగా పెరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జేడీయూ కొత్త చీఫ్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నియమితులయ్యారు.శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.