Home / జాతీయం
2024లో రామ భక్తులను స్వాగతించేందుకు అయోధ్య రామమందిరం సిద్ధమైంది. జనవరిలో సంక్రాంతికి రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం ఆలయంలోకి భక్తుల సందర్శనానికి అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.
ఆధారాలు లేకుండా భర్తను తాగుబోతు, వ్యభిచారి అని పిలవడం క్రూరత్వమని బాంబే హైకోర్టుపేర్కొంది. పూణేకు చెందిన జంట వివాహాన్ని రద్దు చేస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకు రాజీనామా లేఖలు పంపేందుకు నిరాకరించడంతో టూ తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ గతంలో కోరారు.
అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది.
కర్ణాటకలో సాధువులు మృతి కలకలం సృష్టిస్తుంది. రెండు నెలల క్రితం ఓ సాధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరిచిపోకముందే మరో సాధువు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నగరంలో డాక్ బంగ్లా అతిథి గృహం వెనుక 12 ఏళ్ల బాలిక రక్తపు మడుగులో కనిపించింది. మైనర్ బాలిక సహాయం కోసం అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం దుర్గ్ జిల్లాలో గౌర-గౌరీ పూజ సందర్భంగా తనను కొరడాతో కొట్టిన వీడియోను పంచుకున్నారు.
యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రం వడోదరలో అల్లర్లు చోటుచేసుకొన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో వివాదం చోటుచేసుకొనింది. దీంతో ఇరువర్గాల మద్య మాటల యుద్దం తీవ్రం దాల్చింది. హఠాత్తుగా ఓ వర్గం వారు మరో వర్గంపై రాళ్లు రువ్వుకోవడం, విధ్వంసానికి దిగారు.
దీపావళి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో నమోదయింది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.