Home / జాతీయం
దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలుకు స్వల్ప ప్రమాదం చోటు చేసుకొనింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బ తినింది
పంజాబ్ విజిలెన్స్ విభాగం అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కోటి రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై ఏఐజీ ఆశిష్ కపూర్ ను అరెస్ట్ చేసారు.
పవిత్ర తిరుమలలో కన్నుల పండువుగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5.69లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
రాహుల్ జోడో యాత్రకు కొత్త బూస్ట్ వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోన్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నింపింది.
ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్లో జరిగింది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకుంది. కాగా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. అందువల్ల ప్రభాస్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొన్నాడు.
కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.
ప్రపంచంలో ప్రాణం ఉన్న జీవి ఏదైనా. తల్లి ప్రేమలో మాత్రం మార్పు ఉండదు. మాధుర్యాన్ని తెలియచేసే తల్లి ప్రేమపై రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.