Home / జాతీయం
కర్ణాటకలోని దొడ్డలహళ్లిలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మను ముద్రించడంతోవివాదం చెలరేగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజ్‌గార్ మేళా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 75,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు.
ప్రయాణిస్తున్న రైలులో నలుగురు వ్యక్తులు నమాజ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసారంటూ యూపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసారు.
ప్రపంచంలోని మిలీనియల్స్‌లో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం భవిష్యత్తులో ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుందని ప్రభుదాస్ లిల్లాధర్ నివేదిక పేర్కొంది.
దేశంలో మతమార్పిడిని ప్రోత్సహించే మిషనరీలకు అమెజాన్ ఇండియా నిధులు సమకూర్చుతుందనే ఆరోపణలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా #BoycottAmazon అనే ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. నిరుపేద కుటుంబాల స్థానిక చిరు వ్యాపారులకు అండగా ఉందామని నెటిజన్లు అంటున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
ఇతరుల మనోభావాలును దెబ్బతీసేలా ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటివి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రధాని నరేంద్ర మోదీ యువతకు దీపావళి సందర్భంగా భారీ కానుకను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్ ఆఫర్ లెటర్స్ మోదీ అందజేయనున్నారు.