Home / జాతీయం
ప్రముఖ మహిళా సాధికారికత కార్యకర్త, గాంధేయవాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు ఎలబెన్ భట్ (89) కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు.
సబర్మతి నదిపైన గల అటల్ వంతెనపై గంటకు 3,000 మంది సందర్శకులను మాత్రమే అనుమతించాలని అహ్మదాబాద్ పౌర సంఘం నిర్ణయించింది.
పంజాబ్ లో స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విఫలం చెందారని వెంటనే ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
గుజరాత్ లో వంతెన కూలి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన మోర్బి ఘటనా సమయంలో ఓ వ్యక్తి సాహోసపేతంగా వ్యవహరించారు. నదిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న ప్రజల్ని ప్రాణాలు కాపాడి మరణాల సంఖ్య తగ్గించాడు. అందరి ప్రసంశలు అందుకొన్నారు.
అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాత, చెన్నై మరియు దాని పరిసర జిల్లాల్లో విస్తృతంగా, భారీ వర్షాలు కురిశాయి.
కాంగ్రెస్ కు అనూహ్య మైలేజ్ తెప్పిస్తున్న భారత్ జోడో యాత్రలో తన ఫోటో ముద్రించవద్దంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్రాసిన లెటరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశానికి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానంమేరకు బెంగళూరుకు చేరుకొన్న టాలివుడ్ నటుడు జూనియరh ఎన్టీఆర్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును అందచేయనున్న కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు.