Home / జాతీయం
కేసు తేలేంతవరకు, రాష్ట్రంలో విద్యా సంస్ధల్లో హిజాబ్ ను విద్యార్దులు తొలగించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ పేర్కొన్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగ్ పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబాను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది.
దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నిర్మించనున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని పూర్తిచేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్దాయ్ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన అభిషేక్ బోయనపల్లి కస్టడీ ముగియడంతో సీబిఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఇంకా రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సీబిఐ కోర్టును అధికారుల కోరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసి ఆలయానికి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, వారి మాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే క్షుద్ర పూజలకు చిన్నారులను ఉపయోగిస్తున్న మరో వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం జర్నలిస్టు రాణా అయ్యూబ్ సహాయ కార్యక్రమాల కోసం సేకరించిన నిధులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
కొచ్చిలోని అతని పొరుగువారికి, షఫీ కిరాణా దుకాణం యజమాని, గతంలో ట్రక్ డ్రైవర్. వారు అతనితో మరియు అతని కుటుంబంతో పెద్దగా సంభాషించనప్పటికీ అతను రేపిస్ట్ మరియు మానవ అక్రమ రవాణాదారుడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు.