Home / జాతీయం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో 2,521 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ కేసు లో సీబీఐ మంగళవారం తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో బుధవారం ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అందులో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు
ముంబైలో ప్రారంభమైన ఓ స్టార్టప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఇలాంటి ఓ కంపెనీని చూస్తామని కానీ ఊహించలేందంటూ పలువురు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారికి కర్మకాండలు జరిపిస్తుందట.
ఇప్పటివరకు విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఓ ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 71,000 మంది నియామక లేఖలను కొత్త రిక్రూట్మెంట్లకు పంపిణీ చేశారని మరియు వారిని ఉద్దేశించి ప్రసంగించారని ఆయన కార్యాలయం తెలిపింది.
తీహార్ జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్ మంచం మీద పడుకుని ఉండగా పాదాలకు మసాజ్ చేస్తున్నట్లు వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఫిజియో ధెరపీ కాదని మసాజ్ చేసిన వ్యక్తి రింకు అనే పేరుగల వ్యక్తని జైలు వర్గాలు తెలిపాయి.
ఇటీవల కాలంలో ప్రజలు ప్రభుత్వాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. నిన్న కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను ఊరినుంచి గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన మరువకముందే.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై అలాంటి దాడే జరిగింది. అయితే ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. ఈ దాడి సోమవారం రాత్రి జరిగింది.
అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే తనపాలిట యముడయ్యాడు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిని అతి కిరాతంగా హత్య చేశాడు. అంతే కాకుండా తన లిటిల్ ప్రిన్సెస్ మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద విసిరేశారు.