Home / జాతీయం
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ డైరెక్టరేట్ "ప్రత్యేక ఏజెన్సీ" ద్వారా విచారణకు సిఫారసు చేసిందని, ఇందులో "రూ. 1,300 కోట్ల కుంభకోణం" జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది.
బీహార్‌లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పంచాయతీ పెద్దలు కేవలం ఐదు గుంజీల శిక్ష విధించి వదిలేయడం సంచలనం కలిగించింది.
ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద టీటీఈ రైలు నుంచి నెట్టడంతో కిందపడిన ఆర్మీ జవాన్ మరణించాడు. నవంబర్ 17న జరిగిన ఈ సంఘటనలో గాయపడిన జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఢిల్లీలోని జామా మసీదు మసీదు ప్రాంగణంలోకి పురుషులు లేకుండా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మసీదులోకి ఒంటరిగా లేదా గుంపులుగా మహిళలు ప్రవేశించడాన్ని నిషేధిస్తూ జామా మసీదు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.
అధికారి హోదాలో పనిచేస్తున్నా కదా అని రిలాక్స్ అవున్న ఉద్యోగులకు రైల్వేశాఖ షాక్ ఇస్తుంది. విధుల్లో అలసత్వం వహిస్తే ఇంటికి పంపించడం ఖాయమని స్పష్టం చేసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతుంది.
బాలీవుడ్ నటి రిచా చద్దా 2020 గాల్వాన్ ఘర్షణపై చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలపై రిచా ట్వీట్లో 'గాల్వాన్ సేస్ హాయ్' అని రాశారు.
సాధారణంగా రేప్ జరిగిందంటే అయ్యో పాపం అమ్మాయి అంటాము. కానీ ఇక్కడ మాత్రం ఇదెక్కడి దారుణం.. కలికాలం అంటే ఇదేనేమో అని విన్నవారు ముక్కున వేలేసుకుంటూ నివ్వెరపోవాల్సిన స్థితి. ఈకేసులో అత్యాచారం జరిగింది అమ్మాయిపై కాదండి అబ్బాయిపై.. అతడికి మత్తు మందు ఇచ్చి మరీ సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారట.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.