Home / జాతీయం
దేశ వ్యాప్తంగా సందడి నెలకొంది. రంజాన్ పర్వదిన వేడుకులును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం పండుగ నిర్వహిస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేపట్టారు. ముస్లింలు ప్రార్థనా మందిరాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.
Mumbai: ముంబైలో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. మోడల్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ నటితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ ముంబైలోని గోరెగావ్ లోని ఓ హోటల్ లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్ పై పోలీసులు దాడులు చేపట్టారు. మోడల్స్ ను ట్రాప్ చేసి(Mumbai) ఈ దాడుల్లో […]
Satya Pal Malik: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. సత్యపాల్ మాలిక్ కు నోటీసులు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు స్పందించాయి.
ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్లో ఈ నెల 15న గ్యాంగ్స్టర్ అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యల నేపథ్యంలో గ్యాంగ్స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్, అష్రఫ్ భార్య జైనాబ్లు ఇంటికి తాళం కూడా వేయకుండా పరారయ్యారు
భారతదేశంలో కోవిడ్ -19 కేసులు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా కేసుల పెరుగుదలపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరింది.
రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ డెవలపర్ డిఎల్ఎఫ్ల మధ్య జరిగిన భూ ఒప్పందం అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు ఈ ఏడాది ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) తిరిగి నియమించామని హర్యానా పోలీసులు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు తెలియజేశారు.
అస్సాం, అరుణాచల్ప్రదేశ్ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.
Amit Shaw tour: ఈ నెల 23 న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. చేవెళ్లలో నిర్వహించే.. బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ ద్వారా రిజర్వుడు ఈ టిక్కెట్లను అక్రమంగా విక్రయించారనే కేసుకు సంబందించి సీబీఐ సోదాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలోని 12 ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.
దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఆహార వీధులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఇవి ఏర్పావుతాయి.