Home / జాతీయం
పంజాబ్‌లోని లూథియానాలోని ఒక ఫ్యాక్టరీలో ఆదివారం గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది మృతి చెందగా, 11 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటన గియాస్పురా ప్రాంతంలో చోటుచేసుకుంది
గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ లాగే తనను కూడా కాల్చి చంపేస్తారేమో అని భయంగా ఉందని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరఫున ఆయన ప్రచారం చేశారు.
కర్ణాటకలో ఎన్నికల రణరంగం తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు.. ప్రతి విమర్శలతో ఎలక్షన్ హీట్ ని మరింత పెంచుతున్నాయి. ఈ మేరకు తాజాగా కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బీదర్ జిల్లాలోని హమ్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో మొహంతిని
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య అనే విద్యార్థి తొలి ర్యాంక్ ను సాధించాడు.
ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి తన ఫోన్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించిన వీడియో వైరల్ గా మారింది. దీనితో మెట్రో రైలులో మహిళల భద్రతపై నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. దీనిని ఢిల్లీ మహిళా కమీషన్, ఢిల్లీ మెట్రో రైల్ సీరియస్ గా తీసుకున్నాయి.
ద్వేషపూరిత ప్రసంగం దేశం యొక్క లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగల తీవ్రమైన నేరంగా పేర్కొంటూ, సుప్రీంకోర్టు శుక్రవారం తన 2022 ఆర్డర్ యొక్క పరిధిని పొడిగించింది ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా ద్వేషపూరిత ప్రసంగ కేసులను నమోదు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
జార్ఖండ్ తన మొదటి ఎయిర్ అంబులెన్స్ సేవలను శుక్రవారం ప్రారంభించింది. అంబులెన్స్ సర్వీసులు రాంచీతో పాటు మరో ఆరు నగరాల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం యొక్క ఈ చర్య రాష్ట్రంలో వైద్య రవాణా సౌకర్యాలను పెంచి, అవసరమైతే ఇతర గమ్యస్థానాలకు అనుసంధానిస్తుంది
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఫిర్యాదు చేసిన రెజ్లర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై 40 కేసులు ఉన్నాయని సిబల్ చెప్పారు.