Home / జాతీయం
ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ లింకుల కేసులో గృహనిర్బంధంలో ఉన్న కార్యకర్త గౌతమ్ నవ్లాఖా తన భద్రత కోసం పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచడానికి ఖర్చుగా మరో రూ.8 లక్షలు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది
ప్రసిద్ద సాయిబాబా దేవస్థానం కొలువైన షిర్డీ లో నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు గ్రామస్థులు.
సరిహద్దు ప్రాంతాలు మరియు దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రాంతాల్లో ఎఫ్ఎమ్ రేడియో కనెక్టివిటీని పెంచడానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం 18 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 91 ఎఫ్ఎమ్ రేడియో ట్రాన్స్మిటర్లను ప్రారంభించారు.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా న్యూ లమ్కాలో శుక్రవారంముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిన వేదికను గుంపు ధ్వంసం చేసి, తగులబెట్టడంతో సమావేశాలు నిషేధించబడ్డాయి.మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.
పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. గురువారం రోజున రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి. కానీ పిడుగులు మాత్రం భీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పిడుగు పాటుకు గురై ఒక్క రోజులోనే ఏకంగా 14 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. పుర్బ బర్దమాన్ జిల్లా లోనే పిడుగు పాటుకు 4
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని 'విష సర్పంగా అభివర్ణించారు. తరువాత ఖర్గే తన ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది.
మాదకద్రవ్యాల ఆరోపణలపై ఏప్రిల్ 1 నుండి షార్జాలో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా, జైలులో తన జుట్టును డిటర్జెంట్‌తో కడుక్కొని, టాయిలెట్ వాటర్‌తో కాఫీ తయారు చేసుకున్నట్లు తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు గురువారం తెరుచుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తరపున మొదటి పూజ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఉదయం 7:10 గంటలకు ఆలయాన్ని తెరవడాన్ని చూసేందుకు వేలాది మంది యాత్రికులు తేలికపాటి మంచు మరియు వర్షం మధ్య పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు.
బీఏఎంఎస్ డిగ్రీ ఉన్న వైద్యులను ఎంబీబీఎస్ వైద్యులతో సమానంగా చూడాలని గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)తో సమానమైన వేతనం కోసం గుజరాత్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ ఆయుర్వేద వైద్యులు అల్లోపతిలో సమాన వేతనాన్ని పొందలేరని సుప్రీంకోర్టు తెలిపింది.