Home / జాతీయం
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలన మరియు సేవల విషయాలలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని తగ్గించే కొత్త ఆర్డినెన్స్‌తో కేంద్ర ప్రభుత్వంతో తాజా పోరాటానికి సిద్దమయ్యారు
చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.
రూ.2000 కరెన్సీ నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తాను సంతోషిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఏడేళ్లు పట్టిందన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అతడిని కలిసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వీరిద్దరి మధ్య ఇది రెండవ భేటీ కావడం విశేషం.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడాలని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తాను సంతోషంగా లేనని అన్నారు.
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. త్రిభుజాకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.
మహారాష్ట్రలో సామూహిక వివాహాలు చేసుకునే జంటలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10,000 నుంచి రూ.25,000కు పెంచనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు.పాల్ఘర్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో షిండే ఈ ప్రకటన చేసారు.
అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.