Home / జాతీయం
కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ సూద్ వచ్చే రెండేళ్లపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునితో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని పై చర్చ నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత ముఖ్యలైన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యల వర్గీయుల మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది.
చదువుల ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు ఎందరో. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
శనివారం సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ, సీబీఐ డైరెక్టర్ పదవికి ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది.క్యాబినెట్ నియామకాల కమిటీకి పంపబడిన షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో ప్రవీణ్ సూద్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్ణాటక, సుధీర్ కుమార్ సక్సేనా.. డీజీపీ, మధ్యప్రదేశ్, మరియు తాజ్ హసన్ ..డైరెక్టర్ జనరల్, ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మొత్తం 17 మున్సిపల్ కార్పోరేషన్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 17 మేయర్లు మరియు 1,401 కార్పొరేటర్లను ఎన్నుకోవడానికి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మే 4 మరియు మే 11 తేదీలలో రెండు దశల్లో జరిగాయి.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( ఎన్ సి ఆర్ బి), భారత నావికాదళం సంయుక్తంగా జరిపిన దాడిలో శనివారం కేరళ తీరంలో రూ. 15,000 కోట్ల విలువైన 2,500 కిలోల మెథాంఫేటమిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కల్యాణ రాజ్యప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు గాలి జనార్థన్‌రెడ్డి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషం.
ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరిస్తుంది అనుకున్న జేడీఎస్.. తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ పార్టీ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది.