Home / జాతీయం
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.
రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 12 జిల్లాల్లో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా నేటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది,
అస్సాంలోని గువాహటిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. మాటలు రాని ఓ మూగ తల్లి, ఆమె కుమార్తెపై 8 మంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం నిందితులు బాధితుల ప్రైవేటు భాగాలపై కారంపొడి జల్లి పరారయ్యారు. మే 17న ఈ ఘటన జరగ్గా ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు.
గ్రేటర్ నోయిడా పోలీసులు సోమవారం ఒక పాకిస్తానీ మహిళ మరియు ఆమె నలుగురు పిల్లలను అక్రమంగా ఆశ్రయం పొందిన వ్యక్తిని అరెస్టు చేశారు. వీరిద్దరు ఆన్లైన్ గేమ్ పబ్జీ ద్వారా కలుసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధిష్టానం నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేక కన్ను బగర్ సాయి అనే 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక ఆలయంలో మేకను బలి ఇచ్చిన తరువాత ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత, రాష్ట్ర సచివాలయం సమీపంలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్ పవార్ సిద్ధమయ్యారు. అయితే తాళం చెవి కనిపించకుండా పోవడంతో అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆగిపోయారు.
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం హైవేపై ఉన్న హోటల్లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.రాష్ట్ర రాజధాని ముంబయ్ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.