Home / జాతీయం
మణిపూర్‌లో తాజాగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది గాయపడ్డారు. మైటీల ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు గిరిజనులు అధికంగా ఉండే కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల వెంబడి కాల్పులు జరిగాయి.హింసలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎనిమిది వేల కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో డక్కన్ క్రానికల్ సంస్థకి చెందిన 14 ఆస్తులని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని ఆస్తులని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కెనరా, ఐడిబిఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. నేటి ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70వేల మందికి ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించారు.
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో టాటా స్టీల్ కు చెందిన ‘బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్’లో ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీల కోసం ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపారు
మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినందుకు ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లను సస్పెండ్ చేశారు. కాక్‌పిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించిన ఒక నెల తర్వాత ఇది జరిగింది.
: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి
బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఉచితంగా ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ 14 తో గడువు ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూఐడీఏఐ ( భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసేందుకు అవకావం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
బెంగళూరులో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది, 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసి సూట్‌కేస్‌లో కుక్కి మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలేకహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సేనాలి సేన్ అనే నిందితురాలు ఆవేశంతో తన 70 ఏళ్ల తల్లి బీవా పాల్‌ను హత్య చేసింది.