Last Updated:

Influenza Cases: విజృంభిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్.. ఒక్కరోజులోనే 200 కేసులు

ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

Influenza Cases: విజృంభిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్.. ఒక్కరోజులోనే 200 కేసులు

Influenza Cases: కొవిడ్‌ తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలోని హాల్లెట్‌ ప్రభుత్వహాస్పిటల్ ఒక రోజులో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 కేసులు రిపోర్టు అయ్యాయి.

వీటిల్లో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా హాస్పిటల్ బయట రోగులు బారులు తీరారు. మరో పక్క ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్లు పోటెత్తారు. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

 

నిండిపోయిన ఎమర్జెన్సీ వార్డులు(Influenza Cases)

హాల్లెట్‌ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డు నిండిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది అంటే పరిస్థితి తీవ్ర తరం అర్ధమవుతోంది.

‘మెదట 5 నుంచి 6 రోజుల పాటు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు తలెత్తడంతో కాన్పూర్‌ లోని హాస్పిటల్ కు తరలించామని హాస్పిటలో లోని ఓ పేషెంట్‌ బంధువు తెలిపారు.

 

ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి

‘నిజానికి ప్రతిఏటా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి కేసులు చూస్తాం. కానీ, ఈ సారి పేషేంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. గత 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది హాస్పిటల్ లో చేరారు.

వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమందికి వెంటిలేటర్స్ చికిత్స అందిస్తున్నాం.

కొవిడ్‌-19 కాకుండా వేరే వైరస్‌గా గుర్తించడం చాలా క్లిష్టం. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌లో ప్రతి ఉప రకానికి ప్రత్యేకమైన కిట్‌ ఉంది ’ అని హాల్లెట్ హాస్పిటల్ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్ రిచా గిరి వెల్లడించారు.

 

ఇవే ప్రధాన లక్షణాలు

ఇటీవల దేశవ్యాప్తంగా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో దాదాపు సగం మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వాళ్లే.

వీరితో పాటు బయటి రోగుల్లో అత్యధికులకు హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

హెచ్‌3ఎన్‌2 ఉపరకాలు సాధారణ ఇన్‌ఫ్లూయెంజా వేరియంట్స్ కంటే బలంగా ఉన్నాయని తెలిపింది.

ఈ వైరస్ సోకిన 92 శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పుల లక్షణాలు కనిపించగా.. 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు

ప్రధాన లక్షణాలుగా ఉంటున్నాయి.

ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు బాధిస్తోంది.