Last Updated:

Akshay Kumar: భారత పౌరసత్వాన్ని తిరిగిపొందిన నటుడు అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కెనడా పాస్‌పోర్ట్‌ను అధికారికంగా వదులుకుని ఆగస్టు 15, 2023న తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన భారత పౌరసత్వానికి సంబంధించిన పత్రాల ఫోటోను అతను ట్విట్టర్‌లో షేర్ చేసాడు

Akshay Kumar: భారత పౌరసత్వాన్ని తిరిగిపొందిన నటుడు అక్షయ్ కుమార్

 Akshay Kumar:బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కెనడా పాస్‌పోర్ట్‌ను అధికారికంగా వదులుకుని ఆగస్టు 15, 2023న తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన భారత పౌరసత్వానికి సంబంధించిన పత్రాల ఫోటోను అతను ట్విట్టర్‌లో షేర్ చేసాడు. కెనడియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నందుకు అక్షయ్ గతంలో విమర్శలు మరియు ట్రోలింగ్‌లకు గురయ్యాడు.ట్విట్టర్‌లో అక్షయ్ ఇలా రాశాడు, “దిల్ ఔర్ పౌరసత్వం, దోనో హిందుస్తానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్! (sic).

అక్షయ్ కుమార్ ఆజ్ తక్‌లో ‘సీధీ బాత్’ కొత్త సీజన్ యొక్క మొదటి ఎపిసోడ్‌లో కనిపించాడు అతని కెనడియన్ పౌరసత్వం గురించి వెల్లడించాడు. కె తన దేశం, భారతదేశం పట్ల తనకున్న ప్రేమను నిరూపించుకోవడానికి దానిని వదులుకుంటానని చెప్పాడు.భారతదేశం నాకు సర్వస్వం. నేను సంపాదించినదంతా ఇక్కడ నుండి. నేను తిరిగి ఇచ్చే అవకాశం పొందడం నా అదృష్టం. ప్రజలు ఏమీ తెలియకుండా మాట్లాడినప్పుడు మనం బాధపడతాం అని చెప్పాడు. బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు ప్లాపవడంతో తాను కెనడియన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు.

పనికోసం కెనడా వెళ్లడంతో..( Akshay Kumar)

భాయ్, నా సినిమాలు సరిగా ఆడలేదు. దీనితో నేను పని కోసం కెనడా వెళ్లాను. నా స్నేహితుడు కెనడాలో ఉన్నాడు అతను ‘ఇక్కడికి రా’ అన్నాడు. నేను దరఖాస్తు చేసుకున్నాను. ఆ సమయంలో నావి రెండు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అవి రిలీజై సూపర్ హిట్ కావడం నా అదృష్టం. నా స్నేహితుడు, ‘వెనక్కి వెళ్లు, మళ్లీ పని ప్రారంభించు’ అన్నాడు. నాకు మరికొన్ని సినిమాలు వచ్చాయి. నేను బిజీగా మారాను. నా దగ్గర పాస్‌పోర్ట్ ఉందనే విషయం మర్చిపోయాను. ఇప్పుడు నా పాస్‌పోర్ట్ మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు.