Home / తప్పక చదవాలి
తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు.
హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కె మాధవి లత పై కేసు నమోదైంది . పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును తీయమని కోరడం పై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ తనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన అనుచరుడు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులకు సోమవార ఉదయం ఓ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమ్ఆద్మీపార్టీకి చెందిన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్పై దాడి జరిగిందని సమాచారం ఇచ్చారు
రష్యా సరిహద్దులోని బెల్గోరోడ్ అనే నగరంలో ఒక అపార్ట్మెంట్ భవనంలో కొంత భాగం కూలి 13 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. భవనం విధ్వంసానికి ఉక్రెయిన్ బాంబుదాడులే కారణమని రష్యా అధికారులు ఆరోపించారు. ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియోలు, రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలతో బయటపడిన వారి కోసం శిధిలాల గుండా వెతుకుతూవెళుతున్నట్లు చూపిస్తున్నాయి.
నాలుగవ విడత లోకసభ ఎన్నికల ఓటింగ్ క్రమంగా జోరుందుకుంటోంది. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఒక కేంద్ర ప్రాలిత ప్రాంతంతో సహా మొత్తం 96 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు చూస్తే ఓటింగ్ 24.87 శాతంగా నమోదైందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి
ఏపీలో ఓటరు చైతన్యం పోటెత్తుతోంది. ఉదయం పదకొండు గంటలవరుకు 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
షర్మిలకు సొంతగా పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్.. పదేపదే వచ్చి సలహాలు ఇవ్వడంతో పార్టీ పెట్టారని షర్మిల భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్య చేసారు .తాజాగా బ్రదర్ అనిల్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడే కొద్ది ప్రజలు లగ్జరీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ బలపడినప్పుడు దేశ ప్రజల చేతిలో పెద్ద ఎత్తున డబ్బు అడుతున్నట్లు లెక్క. సంపన్నదేశాల్లో లభించే కార్లు కూడా మన దేశంలో లభిస్తున్నాయి.
మన కిచెన్‌లో ఏ పాత్రలో వంట చేసుకుంటే పోషక విలువలు నిల్వ ఉంటాయో ది నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (ఎన్ఐఎన్) తాజగా ఓ గైడ్‌ను విడుదల చేసింది. దీనిపై సైంటిఫిక్‌గా దీర్థకాలంగా పాటు అధ్యయనం చేసింది. తర్వాత కన్సల్టెంట్లు, నిపుణలతో చర్చించి తాజా గైడ్‌ను విడుదల చేసింది.