Election Boycott: తెలంగాణలోని పలు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ
తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు.
Election Boycott: తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు.
స్పష్ఠమైన హామీ ఇవ్వాలంటూ..(Election Boycott)
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్థులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఇక్కడి రైతులు ధర్నా చేపట్టారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం అల్లంపల్లిలో గ్రామస్థులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదు. తమ ఊరి రోడ్డు సమస్యను తీర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. మైనింగ్ ఎన్‌వోసీ అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొడిచెర్ల తండా వాసులు తమ గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని ఎంఆర్‌వో రవీందర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఓటు వేశారు.