Home / తప్పక చదవాలి
పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీ లోని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు... విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు.
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు లో చుక్కెదురైంది . 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి సంబందించిన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది .
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మరోవైపు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సరైన దారిలేకపోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.