Home / తప్పక చదవాలి
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
'మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యపై క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విధించిన శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు పెద్ద రిలీఫ్ ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో రీ ఎంట్రీకి మార్గం సుగమమైంది.
హర్యానాలోని నుహ్‌లో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం శుక్రవారం టౌరు పట్టణంలో 'బుల్డోజర్ చర్య' ప్రారంభించింది.నుహ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం కూల్చివేసింది.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, దుకాణాలు ధ్వసం అయ్యాయి. 19 మంది గల్లంతు కాగా వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అని వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్షకి గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట దొరికింది. సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 10వ తేదీ నుంచి విశాఖ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. యాత్రలో భాగంగా 6 ఫీల్డ్ విజిట్స్ , 2 బహిరంగ సభలు, ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉత్తర సముద్రంలో చమురు మరియు గ్యాస్ డ్రిల్లింగ్‌ను విస్తరించాలనే ప్రణాళికకు నిరసనగా బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కంట్రీ ఎస్టేట్‌ను గ్రీన్‌పీస్ ప్రదర్శనకారులు గురువారం నల్ల బట్టతో కప్పారు.వీరు పోస్ట్ చేసిన వీడియోలో, సిబ్బంది న ఎరుపు రంగు జంప్సూట్లు, హెల్మెట్లు ధరించి, నిచ్చెనలను ఉపయోగించి యార్క్‌షైర్ ఇంటి పైకప్పుపైకి ఎక్కడం కనిపించింది.
బ్రెజిల్ లోని మూడు రాష్ట్రాల్లో పోలీసులు ప్రారంభించిన మాదకద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా జరిగిన అనేక దాడుల్లో 43 మంది మరణించారు. రియో డి జెనీరోలోని కాంప్లెక్సో డా పెన్హా ప్రాంతంలో బుధవారం తిరిగి కాల్పులు జరిపారని, కనీసం పది మంది మరణించారని, మరో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.