Last Updated:

Bulldozer Action: హర్యానాలోని నుహ్ సమీపంలో బుల్‌డోజర్‌ యాక్షన్ ..200 కు పైగా గుడిసెల ధ్వంసం..

హర్యానాలోని నుహ్‌లో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం శుక్రవారం టౌరు పట్టణంలో 'బుల్‌డోజర్ చర్య' ప్రారంభించింది.నుహ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం  కూల్చివేసింది.

Bulldozer Action: హర్యానాలోని నుహ్ సమీపంలో బుల్‌డోజర్‌ యాక్షన్ ..200 కు పైగా గుడిసెల ధ్వంసం..

Bulldozer Action:హర్యానాలోని నుహ్‌లో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం శుక్రవారం టౌరు పట్టణంలో ‘బుల్‌డోజర్ చర్య’ ప్రారంభించింది.నుహ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం  కూల్చివేసింది. అయితే బుల్డోజర్ తరలింపు, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యగా కూడా పరిగణించబడుతుంది, ఎందుకంటే జిల్లా యంత్రాంగం మరియు ముఖ్యమంత్రి ఇద్దరూ ఘర్షణల్లో వలసదారులు పాల్గొన్నారని ఆరోపించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూల్చివేతకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇంతకుముందు అస్సాంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ  వలసదారులు నుహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి వెంట వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. సుమారు ఒక ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించగా, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం.భారీ పోలీసు మరియు పారామిలటరీ మోహరింపు మధ్య అవాంతరాలు ఎదురుకాకుండా బుల్డోజర్ చర్య జరిగింది. పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు.హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రారంభించిన ఈ కూల్చివేత కార్యాక్రమంలో , మహిళా పోలీస్ ఫోర్స్‌తో సహా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు ఈ ప్రాంతంలో 200 మందికి పైగా అక్రమ గుడిసెల నివాసాలను ధ్వంసం చేశాయి.

రెండురోజుల కిందటే చెప్పిన సీఎం..(Bulldozer Action)

విశ్వహిందూపరిషత్ ఊరేగింపుపై దాడిలో చొరబాటుదారులతో సహా బయటి వ్యక్తులు పాల్గొన్నారని పోలీసులు మరియు పరిపాలన యంత్రాంగం ఆరోపించాయి. యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ తరహాలో హర్యానాలోనూ బుల్‌డోజర్‌ చర్యలు తీసుకుంటామని రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సూచించారు.మరోవైపు బుధవారం అర్థరాత్రి తౌరులోని రెండు మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం కూడా జరిగింది.ఈ వారం గురుగ్రామ్ మసీదులలో శుక్రవారం ప్రార్థనలు జరగవు. ముస్లీం మత పెద్దలు ప్రజలు తమ ఇళ్ల నుంచి ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.హర్యానాలో ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 176 మందిని అరెస్టు చేయగా, 90 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి.