Home / తప్పక చదవాలి
ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో నటించిన బెల్లిని , తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి మహిళా కేర్‌టేకర్‌గా నియమించింది. బెల్లి నీలగిరి జిల్లాలోని తెప్పక్కడు ఏనుగుల శిబిరంలో మావటికి సహాయకురాలిగా నియమించబడింది.
వాట్సాప్ జూన్ నెలలో భారతదేశంలో 66 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో, 2,434,200 ఖాతాలు వినియోగదారు నివేదికలు అందకముందే ముందస్తుగా నిషేధించబడ్డాయి. భారతదేశం యొక్క ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా చర్యలు తీసుకుంది.
కేంద్రం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా-స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు మరియు సర్వర్లపై దిగుమతి ఆంక్షలను విధించింది. ఈ చర్యతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయని భావిస్తున్నారు.
హర్యానాలోని నుహ్ మరియు రాష్ట్రంలోని మరికొన్ని ప్రదేశాలలో మొబైల్ ఇంటర్నెట్ మరియు ఎస్ఎంఎస్ సేవలను గురువారం మధ్యాహ్నం ఒంటిగంటనుండి మూడు గంటలపాటు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.మత ఘర్షణల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంజుమన్ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయనుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
లోకసభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రమనస్తాపం చెందారు. లోకసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రవర్తనతో ఆయన విసుగు చెందారు. సభను సజావుగా సాగనీయకుండా అడుగడుగునా అడ్డుతగలడంతో ఆయన సభకు రాకుండా ముఖం చాటేశారు. సభ్యుల తీరులో మార్పు వచ్చే వరకు తాను సభలకు హాజరుకాబోనని తన సన్నిహితులకు చెప్పారని తెలిసింది.
సిగరెట్లపై ఆరోగ్య హెచ్చరికలను ముద్రించిన మొట్టమొదటి దేశంగా కెనడా చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆ దేశ మానసిక ఆరోగ్యం మరియు వ్యసనాల మంత్రి కరోలిన్ బెన్నెట్ ఈ విషయాన్ని ప్రకటించారు.