Home / తప్పక చదవాలి
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు వణికిపోయాయి.మనదేశంలో స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో 1,000 పాయింట్ల వరకు నష్టపోయి.. మార్కెట్ ముగిసే సమయానికి కాస్తా కోలుకుని 700 పాయింట్ల నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద 3.65 లక్షల కోట్లు హారతి కర్పూరం అయ్యింది. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడానికి ప్రధాన కారణం రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను AAA నుంచి AA+కు కుదించడం.
సినీ నటి జయసుధ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు
రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీసీఎఎ అర్హత సాధించిన వారు తెలుగు రాష్ట్రాల్లో 400మందిని పెండింగులో ఉంచారని తెలిపారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందిని నెయ్యిని వినియోగించరు. దీనితో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది. దీనిపై కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది.
ప్రఖ్యాత చిత్ర కళా దర్శకుడు నితిన్ దేశాయ్ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని తన ఎన్డి స్టూడియోలో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు, సూసైడ్ నోట్ కనుగొనబడలేదు. అయితే, ఆడియో రికార్డింగ్ ఉంది. ఫోరెన్సిక్ బృందం దానిని విశ్లేషించే పనిలో ఉంది.
ప్రముఖ భారతీయ కళా దర్శకుడు నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని వయస్సు 58. అతని మృతదేహం కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ రాయ్‌గఢ్‌లోని అతని ఎన్డి స్టూడియోలో కనుగొనబడింది. అతను ఎన్డి స్టూడియోస్ యజమాని . పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కర్జాత్‌లోని తన స్టూడియోలో దేశాయ్ ఉరివేసుకుని కనిపించాడు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఊరేగింపుపై దాడిని పెద్ద కుట్రలో భాగమని అభివర్ణించారు. మరోవైపు వీహెచ్‌పీ జాతీయ దర్యాప్తు సంస్ద ద్వారా విచారణకు డిమాండ్ చేసింది.
భారతదేశంలో దేశీయ ప్యాసింజర్ వాహనాల (PV) విక్రయాలు సంవత్సరానికి (y-o-y) 3.1 శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి, జూలైలో వీటి విక్రయాలు 352,492 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (SUVలు) ఎక్కువగా ఉన్నాయి.
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి తాజాగా 20,000 రూపాయల విలువైన ఆపిల్ ఇయర్‌బడ్‌లను పెట్టుకుని కనిపించాడు. ఈ ప్రత్యేకమైన ఇయర్‌బడ్‌లు భారతదేశంలో ఇంకా అందుబాటులో లేవు.బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) షేర్ చేసిన వీడియో జాషువా డా సిల్వా తల్లి కోహ్లిని కలిసిన సమయంలో అతను వీటిని పెట్టుకున్నాడు.
:జూలై 2023 వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం వసూళ్లు రూ. 165,105 కోట్లు గా ఉన్నాయి. 2022లో అదే నెలలో నమోదైన దానికంటే జూలై లో జీఎస్టీ ఆదాయం 11 శాతం ఎక్కువ.ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం , జూలైలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో, సీజీఎస్టీ రూ.29,773 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,623 కోట్లు, ఐజీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,239 కోట్లతో కలిపి) మరియు సెస్సు రూ.11,779 కోట్లు. (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 840 కోట్లతో సహా)