Home / తప్పక చదవాలి
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదివరకు వైఎస్సార్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా భూమన పని చేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన ఉన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్లపాటు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
మోదీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది గంటలకే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి విందులోపాల్గొన్నారు. ఆర్జేడీ ఎంపీ మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఈ విందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు.
శుక్రవారం అర్థరాత్రి మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తాజా హింసాత్మక సంఘటనలలో కనీసం ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారు.తాజా హింసాకాండలో, కుకీ వర్గానికి చెందిన ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా ప్రాంతంలో కుకీ వర్గానికి మరియు భద్రతా బలగాలకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. మణిపూర్ పోలీసులు, కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకి సత్వరమే ఆమోదం తెలుపనందుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఈ ఉదయం బస్సులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ర్యాలీగా చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్న గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చలకు ఆహ్వనించారు.
యూకే లో మెడిసిన్ చదువుదామనుకునే వారికి ముఖ్యంగా వచ్చే ఏడాది అడ్మిషన్లు కోరుకునే వారు వెంటనే అప్లై చేసి ప్రవేశ పరీక్షకు సిద్దమవ్వాలి. ఈ పరీక్షను UCAT అంటారు. అంటే యూకే క్లినికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ .. యూకేలోని 35 కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువాలనుకునే విద్యార్దులు 2024 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 20న నోటిఫికేషన్ జారీ అయింది.
నల్ల సముద్రపు నౌకాశ్రయం నోవోరోసిస్క్ సమీపంలో రష్యా నౌకాదళ స్థావరంపై ఉక్రెయాన్ న్ సముద్ర డ్రోన్లు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశాయని, రష్యా యుద్ధనౌకలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది రష్యా ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది.
ఇథియోపియా ప్రభుత్వం శుక్రవారం తన రెండవ అతిపెద్ద ప్రాంతమైన అమ్హారాలో సైనిక మరియు స్థానిక ఫానో మిలీషియాల మధ్య ఘర్షణల నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పొరుగున ఉన్న టిగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల అంతర్యుద్ధం గత నవంబర్‌లో ముగిసినప్పటి నుండి ఈ వారం ప్రారంభంలో చెలరేగిన పోరాటం ఇథియోపియాలో అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికలు రావచ్చనిపిస్తోందని అన్నారు.పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డామన్నారు.