Last Updated:

Telangana Secretariat: తప్పిన ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు

Telangana Secretariat: తప్పిన ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు

Telangana Secretariat Slab Collapsed: తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దీంతో సచివాలయం కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం ధ్వంసం అయింది. సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష నిర్వహించిన అనంతరం పెచ్చులూడిన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

సచివాలయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, సచివాలయాన్ని నిర్మించే సమయంలో పలు సమస్యలు ఉన్నాయని గతంలో నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయం నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. తన ఛాంబర్‌తో పాటు టాయ్‌లెట్స్‌లో శబ్ధాలు వస్తున్నాయని స్వయంగా అధికారులకు తెలిపారు. అయితే అదంతా ఇంటర్‌నల్‌గా జరిగింది. అయితే సచివాలయం సౌత్, ఈస్ట్ ప్రధాన ద్వారం వద్ద లోపలికి వెళ్లే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా, మంత్రులతో పాటు అధికారులు వాహనాలను కూడా అక్కడే పార్క్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐదో అంతస్తు నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ఊడి పడిందని అంటున్నారు. పెద్దఎత్తన శబ్ధాలతో పెచ్చులూడిపడటంతో అధికారులు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థ..
సెక్రటేరియట్‌ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్​జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్‌మెంట్‌ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని, అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. ఊడి పడింది జీఆర్‌సీ ఫ్రేం అని తెలిపింది. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్‌ఎసీ డ్రిల్ చేస్తున్నారని, దీంతో జీఆర్‌సీ డ్యామేజ్ అవుతుందన్నారు. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోందని, ఎలాంటి నాణ్యత లోపం లేదని తాము ఘటనపై రివ్యూ చేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: