Home / తప్పక చదవాలి
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతెలిపారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతికి ఎంపిక చేసింది.
టీపీసీసీ అధ్యకుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఇక కల్వకుంట్ల కుటుంబానికి కౌంట్‌డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ 52 రోజుల కౌంట్ డౌన్..నాలుగు కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం అని రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో బిఆర్ఎస్ ఎన్నికల కసరత్తుని వేగవంతం చేసింది. ఈ నెల 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయి బి ఫారాలను అభ్యర్థులకు అందజేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..! రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!మూడోసారి మనదే జయం..! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 297 మంది ప్రాణాలను బలిగొన్న రైలు ప్రమాదం జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా 28 మృతదేహాలు మిగిలిపోయాయి. వీటిని ఎవరూ గుర్తు పట్టకపోవడం, క్లెయిమ్ చేయకపోవడంతో, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ ) అధికారులు ఈ మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భద్రతా స్థాయిని Y+ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షారూఖ్ ఇటీవలి సినిమాలు 'పఠాన్' మరియు 'జవాన్' విజయవంతమైన తర్వాత అతనికి బెదిరింపులు రావడంతో రాతపూర్వక ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత, మరింత నాణ్యమైన చికిత్స అందించేందుకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు ప్రత్యేకంగా ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) ఏర్పాటు చేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శంషాబాద్ విమానాశ్రయం లగేజీ స్క్రీనింగ్ అధికారులు ఓ వ్యక్తి తీసుకువచ్చిన లగేజీని పరిశీలించి అవాక్కయ్యారు. క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలను అతడు తరలిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
ఇజ్రాయెల్ ,పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. గాజాలో సుమారుగా 413 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.