Home / తప్పక చదవాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నారా లోకేష్ కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.
తన కొడుకుని మిస్సవుతున్నానంటూ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. అని ప్రశ్నించారు. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. అని అడిగారు.
మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజుల్లో ఈ ఆసుపత్రిలో మరో 108 మరణాలు సంభవించాయి
తెలంగాణ హైకోర్టు బుధవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సిసిఎల్ )లో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలను డిసెంబర్ 27 కి వాయిదా వేసింది. ఎస్‌సిసిఎల్ చేసిన అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన తీర్పును వెలువరించింది. నవంబర్ 30లోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 15న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభ జరగనుంది. అనంతరం ఈ నెల 16 నుంచి నవంబర్ 9 వరకు పర్యటించనున్నారు.
ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఇంట్లో నేడు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి అయిన షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సియాల్కోట్లో గుర్తు తెలియని సాయుధులు అతడిని కాల్చిచంపినట్లు సమాచారం. షాహిద్ లతీఫ్ భారతదేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.