Home / తప్పక చదవాలి
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తక్షణం ఏవైతే అవసరమో వాటిని రాబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ, జనసేన మిశ్రమ ప్రభుత్వం అమలు జరిపేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య తెలిపారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో టికాంగ్రెస్ పీఏసి సమావేశమైంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీఎసి సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 15 నుండి ప్రారంభించాలనుకుంటున్న బస్సు యాత్ర షెడ్యూల్ ,రూట్ మ్యాప్ పై చర్చించారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
కాంగ్రెస్ పార్టీతో మరియు తన పనిలో బిజీగా ఉండటం వలనే తాను పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైపూర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేశారు.
ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ఉందని తెలంగాణలో కూడా బీజేపీ పాలనను తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం అదిలాబాద్ లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించి.. బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ రియాలిటీ షో బాస్ కన్నడ హౌస్‌లోకి ప్రవేశించడం వివాదాలు మరియు విమర్శలను రేకెత్తించింది. షో యొక్క 10వ సీజన్ ప్రోమోలో ఈశ్వర్ అభిమానుల కోసం ఇంట్లోకి ప్రవేశించినట్లు చూపబడింది.
కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఓ పాడి రైతుకు బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకింది.రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి జె.చించు రాణి దీనిపై మాట్లాడుతూ.. వెంబాయం పంచాయతీలో వ్యాధిని గుర్తించామని పాల సొసైటీలపై ప్రత్యేక దృష్టి సారించి పశుసంవర్థక శాఖ ద్వారా పాల పరీక్షలు నిర్వహించి దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఇజ్రాయెల్ సైన్యం తమభూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలు హమాస్ ప్రభుత్వ కేంద్రాలకు నిలయమైన గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి.
:తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకావడంతో.. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలయింది.