Home / తప్పక చదవాలి
టి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ దక్కనివారు నేరుగా గాంధీ భవన్‌నే టార్గెట్ చేస్తున్నారు. దీంతో రోజూ గాంధీ భవన్ గేట్లకి తాళాలు వేస్తున్నారు. తాజాగా గాంధీ భవన్ వద్ద భద్రతని పెంచారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులని రంగంలోకి దించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.
చంద్రబాబుకు పదవి కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదని.. రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకే వారికి అధికారం కావాలని సీఎం జగన్ అన్నారు. పుట్టపర్తిలో రైతు భరోసా, పీఎం కిసాని నిధులు విడుదల చేసిన జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.
: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలయింది. పన్నెండు మంది అభ్యర్థులను సీట్లు ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది తర్వాత ఒకరు, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకూ వంద మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది.
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఇటీవల వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటన వివాదం ఇంకా సద్దుమణగలేదు. లైంగిక వేధింపుల బాధితురాలికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు మరోసారి ఆందోళనకి దిగారు. ఇఫ్లూ విసికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీలు దారుణంగా క్షీణిస్తున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరగడంతో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలుష్య నియంత్రణకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి మళ్లీ ‘సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్ర నాయకులు ప్రచారానికి రానున్నారు.
గద్వాల చరిత్ర చాలా గొప్పదని అటువంటి గద్వాలను గబ్బు పట్టించిందెవరో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం గద్వాల లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరువుతో అల్లాడామని అన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, కన్నీళ్లు తప్పవని అన్నారు.
సుప్రీంకోర్టు సోమవారం నాడు పలు రాష్ట్రాల గవర్నర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఎందుకు నాన్చుతున్నారని ప్రశ్నించింది. కాగా పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ భన్వారీలాల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధానికి 200 బిలియన్ షెకెల్స్ (ఇజ్రాయెల్ కరెన్సీ) అంటే సుమారుగా $51 బిలియన్లు ఖర్చవుతుందని కాల్కలిస్ట్ ఆర్థిక వార్తాపత్రిక ప్రాథమిక ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలను ఉదహరిస్తూ పేర్కొంది. 1 షెకెల్ 21.43 భారతీయ రూపాయలకు సమానం.