Telangana Elections: తెలంగాణ ఎన్నికలు..బీజేపీ నాలుగో జాబితా విడుదల
: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలయింది. పన్నెండు మంది అభ్యర్థులను సీట్లు ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది తర్వాత ఒకరు, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకూ వంద మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది.
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలయింది. పన్నెండు మంది అభ్యర్థులను సీట్లు ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది తర్వాత ఒకరు, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకూ వంద మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది.
జనసేనతో చర్చల తరువాత ..(Telangana Elections)
నాల్టవ జాబితాలో ఉన్నవారిలో చెన్నూర్ నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి -సుభాష్ రెడ్డి,వేములవాడు- తుల ఉమ, హుస్నాబాద్- శ్రీరామ్ చక్రవర్తి,సిద్ధిపేట-శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్-నవీన్,కొడంగల్- బంటు రమేష్ కుమార్, గద్వాల్- బోయ శివ,మిర్యాలగూడ- సాధినేని శ్రీనివాస్, మునుగోడు- చలమల కృష్ణారెడ్డి,నకిరేకల్- మొగులయ్య, ములుగు- ప్రహ్లాద్ నాయక్ తదితరులు ఉన్నారు. ఇలా ఉండగా జనసేన పార్టీతో ఎన్నికలకు ముందు ఒప్పందం చేసుకున్న బీజేపీ ఆ పార్టీకి తొమ్మిది సీట్లు కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్ర నాయకులు ప్రచారానికి రానున్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ వంటి నేతలకు కూడ ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.