Home / తప్పక చదవాలి
కెన్యా మరియు సోమాలియాలో భారీ వర్షాలు మరియు ఆకస్మిక వరదలు కనీసం 40 మంది మరణించగా వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సహాయ సంస్థలు సోమవారం నివేదించాయి.సోమాలియాలో వరదల కారణంగా సుమారుగా 25 మంది మరణించారు.
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్ళపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.
ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆలంపూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి స్థానంలో కొత్త యాప్ తీసుకొస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఇరాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గిస్ మొహమ్మది సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు. అధికారుల చర్యను నిరసిస్తూ ఆమె ఈ దీక్షను ప్రారంభించారు.
ఇజ్రాయెల్‌కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఇజ్రాయెల్‌పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నయుద్ధం క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మంగళవారం డేటాను విడుదల చేసింది. . డేటా ప్రకారంఅగ్రవర్ణాల్లో భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉంది. బీహార్‌లో 27.58 శాతం భూమిహార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని డేటా పేర్కొంది.
భారత్ జోడో యాత్ర రెండో దశ ఈ ఏడాది డిసెంబర్ మరియు ఫిబ్రవరి 2024 మధ్య జరిగే అవకాశం ఉందని మంగళవారం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గత ఏడాది సెప్టెంబర్ 7 నుండి జనవరి 30, 2023 వరకు మొదటి దశ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
భారతదేశం-మయన్మార్ సరిహద్దు పట్టణం మోరే వద్ద హైవే వెంబడి తిరుగుబాటుదారుల ఆకస్మిక దాడిలో చిక్కుకున్న మణిపూర్ పోలీసు కమాండోలను రక్షించడంలో అస్సాం రైఫిల్స్ దళాలు అసాధారణమైన ధైర్యాన్ని మరియు సమన్వయాన్ని ప్రదర్శించాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీని ఏటా తీవ్ర వాయు కాలుష్యం బారిన పడేలా చేయడం సరి కాదని పంట వ్యర్దాలను తగులబెట్టడంపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో భాగస్వామ్య పక్షాలందరినీ బుధవారం సమావేశమై సమావేశం కావాలని సుప్రీంకోర్టు కోరింది.