Home / తప్పక చదవాలి
హమాస్ నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా గాజా స్ర్టిప్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఈ నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి.
జనసేన -టీడీపీ కూటమి మేనిఫెస్టో ఓట్లని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇచ్చే హామీలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే ఓటర్లని ఆకట్టుకుంటాయి.? ఏ ఆకర్షణతో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్న సంక్షేమానికి మించి మంచి సంక్షేమాన్ని అంద జేస్తాయి అన్నదే కీలక అంశంగా నిలుస్తుందని జోగయ్య సూచించారు.
ఆదివారం ఖమ్మంలోనిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. పువ్వాడ ఇప్పటివరకు 4 పార్టీలు మారారని ఆయన తండ్రిని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడనే విషయం అందరికి తెలిసిందే .జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై వున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఒక హోటల్ లో తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకొని సూసైడ్ కు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే అతను కాల్చుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు బాగా ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం, కొత్తగూడెం లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.
కేరళలోని ఒక పెంపుడు కుక్క కన్నూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ ముందు తన యజమాని కోసం వేచి ఉంది. అక్కడ గత నాలుగు నెలలు కిందట మరణించిన తన యజమాని తిరిగి వస్తాడని భావిస్తూ అక్కడే తిరుగుతోంది. ఆసుపత్రి ఉద్యగులు అక్కడికి వచ్చేవారు కుక్క కు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు విస్తుపోతున్నారు.
: సాయుధ దళాలలోని మహిళా సైనికులు, నావికులు మరియు వైమానిక దళంలో పనిచేసే మహిళలకు అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ మరియు పిల్లల దత్తత సెలవుల నిబంధనలను పొడిగించే ప్రతిపాదనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు
దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఆదివారం X (గతంలో ట్విట్టర్)లో ఈ ప్రకటన చేశారు.
శనివారం రాత్రి సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని మాఘాజీ శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 51 మంది పాలస్తీనియన్లు, ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు మరణించగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్ ) శనివారం రాత్రంతా గాజాపై బాంబు దాడులు కొనసాగించింది. గాజా స్ట్రిప్ యొక్క ఉత్తర ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేసింది.